వైఎస్‌ఆర్ సీపీతోనే అభివృద్ధి | development with ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీతోనే అభివృద్ధి

Published Mon, Mar 24 2014 2:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

వైఎస్‌ఆర్ సీపీతోనే అభివృద్ధి - Sakshi

వైఎస్‌ఆర్ సీపీతోనే అభివృద్ధి

 పులివెందుల, న్యూస్‌లైన్: రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు. స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు స్థానిక ఎన్నికలపై సమీక్షించారు.

ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులతో చర్చిం చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల విజయంకోసం కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం రోజుతో నామినేషన్లు పూర్తి కాగానే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలోకి రంగంలోకి దిగాలని వారు కోరారు.
 
 వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరిన  లింగాల టీడీపీ నాయకులు..  

 మండల కేంద్రమైన లింగాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు, నాయకులు అలవలపాటి కృష్ణారెడ్డి, అలవలపాటి దివాకర్‌రెడ్డి  ఆదివారం సాయంత్రం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి సమక్షంలో రాజుల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీలోకి చేరారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రాజుల పురుషోత్తమరెడ్డి, లింగాల మండల నాయకులు సారెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement