
కడప ఎస్పీ బాబూజీ అట్టాడా
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పులివెందులలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, కడప ఎస్పీ బాబూజీ అట్టాడా అన్నారు. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పారు. నిన్న జరిగిన సంఘటనపై కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నామన్నారు.
నిన్నటి జరిగిన సంఘటనలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని బాబూజీ చెప్పారు. పరిస్థితి అదుపు తప్పినపుడే పోలీసులు రంగంలోకి దిగాలన్నారు. అనవసరంగా లాఠీ చార్జీ చేయకూడదని హెచ్చరించారు. అందుకే మేము సంయమనం పాటిచామన్నారు.