
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.
వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు.

Comments
Please login to add a commentAdd a comment