
'కేసీఆర్ మానస పుత్రిక వాటర్ గ్రిడ్ పథకం'
వాటర్ గ్రిడ్ పథకం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పథకం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం వాటర్ గ్రిడ్ పై జరిగిన సమీక్షా సమావేశం జరిగిన అనంతరం ఆయన మాట్లాడారు. వాటర్ గ్రిడ్ కు అన్నిశాఖల నుంచి ఒకేసారి పర్మిషన్లు కోరుతున్నామన్నారు.అందుకోసం 29 రిజర్వాయర్లు ఉపయోగిస్తున్నామన్నారు.
కొందరు ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి ద్వారి ప్రతీ ఇంటికి రక్షిత నీటి సరఫరా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు.