హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్ ఆరంభించారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్దరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో పరిశ్రమలకు ఉపయోగపడే భూములున్నాయని, అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న విషయం తెలిసిందే.