వాటర్‌గ్రిడ్‌పై నేడు సీఎం సమీక్ష | Water Grid Today Siem Review | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్‌పై నేడు సీఎం సమీక్ష

Published Tue, Dec 30 2014 1:46 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

వాటర్‌గ్రిడ్‌పై నేడు సీఎం సమీక్ష - Sakshi

వాటర్‌గ్రిడ్‌పై నేడు సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సమీక్షించనున్నారు. సీఎం స్వయంగా సమీక్షకు పిలవడంతో..  గ్రిడ్ నిర్మాణ బాధ్యతలను చూస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఈ పథకంపై సమాచారాన్ని  సిద్ధం చేశారు.

తొలుత ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ శాఖ మంత్రి కేటీఆర్, చివరిగా సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్‌పై అధికారులతో సమీక్షించి ప్రణాళికలకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న అధికారులతో జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపైనే ప్రధానంగా సీఎం దృష్టి సారించనున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement