వాటర్‌గ్రిడ్‌కు మరో రూ.18,965 కోట్లు | another eighteen thousand crores for water grid | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్‌కు మరో రూ.18,965 కోట్లు

Published Wed, Jun 24 2015 1:11 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

another eighteen thousand crores for water grid

ఆర్‌డబ్ల్యూఎస్‌లో బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్(వాటర్‌గ్రిడ్)కు మరో రూ. 18,965కోట్ల మంజూరుకు సర్కారు పరిపాలన ఆమోదం తెలిపింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని సెగ్మెంట్ల నిర్మాణం కోసం రూ.10,570 కోట్లు, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని సెగ్మెంట్ల కోసం రూ.8,395 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 సెగ్మెంట్లలో కొన్నింటి కోసం ఈ నెల 1న రూ. 15,603 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఇంజనీర్లు, నాన్ టెక్నికల్ సిబ్బంది బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం వేరొక ఉత్తర్వును జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement