♦ అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ పనులు
♦ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా నీటి సరఫరా
♦ రోడ్డు పనుల్లో అక్రమాలకు తావివ్వొద్దు
♦ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
♦ వరికోలు, పులిగిల్ల, హసన్‌పర్తి పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
♦ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. నాణ్యత, నిధుల విషయంలో రాజీలేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపడుతున్నామని... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులతో కలిసి పరకాల మండలంలోని వరికోల్ గ్రామంలో గ్రామీణ రోడ్ల నిర్మాణ పథకం, రోడ్ల మరమ్మత్తు పనులకు పులిగిల్లలో శంకస్థాపన చేశారు. హసన్‌పర్తి మండలంలో రోడ్ల పనులను ప్రారంభించారు.
అనంతరం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపముఖ్యమంత్రి కడియం, మంత్రి చందులాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, కలెక్టర్ కరుణ, జెడ్పీచైర్‌పర్సన్ పద్మతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్‌గ్రిడ్, గ్రామీణ రోడ్లు, ఆసరా పింఛన్లు, హరిత హారం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకం ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమన్నారు.
తాగు నీరు పొందడం ప్రజల హక్కు అని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అవినీతి రహితంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్‌వల్ల తాగునీటితోపాటు పారిశ్రామిక ప్రగతి కూడా ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల 5 మీటర్ల లోతుకు నీరు వెళ్లిందని నివేదికలు చెబుతున్నాయని వివరించారు. జిల్లాలో ఐదు సెగ్మెంట్ల నుంచి తాగు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఎల్‌ఎండీ సెగ్మెంట్...
ఎల్‌ఎండీ సెగ్మెంట్ ద్వారా వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నియోజకవర్గాలు, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కొన్ని మండలాలు, ఒక కార్పొరేషన్, నగర పంచాయతీలకు రూ.720 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ తెలిపారు.
పాలేరు..
డోర్మకల్, మహబూబాబాద్, నర్సంపేట, నియోజకవర్గాలతోపాటు ములుగులోని కొత్తగూడ, పాలకుర్తిలోని రాయపర్తి, తొర్రూరు మండలాలకు కలిపి మొత్తం 17 మండలాలు, ఒక మునిసిపాలిటీ, ఒక నగర పంచాయతీ పరిధిలో రూ.1800 కోట్లతో నీరందించే ప్రణాళికలు రూపొందించామని మంత్రి పేర్కొన్నారు.
గోదావరి, రామప్ప ...
గోదావరి, రామప్ప సెగ్మెంట్ ద్వారా ములుగు నియోజకవర్గం, భూపాలపల్లిలోని గణపురానికి నీరిదించేందుకు రూ.286 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ వివరించారు.
ఎల్‌మడుగు..
ఈ సెగ్మెంట్‌ద్వారా రూ.342.66 కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాలకు, ఒక నగర పంచాయతీకి నీరందిస్తామని మంత్రి వెల్లడించారు.
నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం వే సవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు నిర్మాణం విషయంలో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై క ఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత పరిశీలనకు ప్రత్యేక తనిఖీ ృందాలు ఏర్పాటు చేయూలని సూచంచారు. నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లయితే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని పూర్తి స్థారుులో వ్యవసాయానికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత తాగునీటి పనులకు మరో రూ.1.20కోట్లు విడుదల చే యాలని కోరారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజక వర్గంలో రూ.6 కోట్ల తాగునీటి పనులకు ప్రతిపాదనలు పంపించామని, ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని చెప్పారు. మిగతా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ నియోజక వర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.80లక్షలు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ కొత్త బావుల తవ్వకానికి నిధులు ఇవ్వాలని కోరారు.
అధికారుల పడిగాపులు...
కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 2గంటలకు మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం ఇవ్వడంతో అన్నిశ ాఖల అధికారులు మధ్యాహ్నం ఒంటి గంటకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పరకాల, హసన్‌పర్తి కార్యక్రమాలతోపాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలెక్టరేట్‌లో సమావేశం సాయంత్రం 4గంటల తర్వాత ప్రారంభమైది.సుమారు రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. దీంతో కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఉద్యోగులు సుమారు 7గంటలపాటు పడిగాపులు కాశారు.
అవినీతిని ఉపేక్షించం...
Published Mon, Apr 13 2015 1:52 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement