ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం | korea environment corporation ready to take up telangana projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం

Published Thu, Oct 16 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

korea environment corporation ready to take up telangana projects

* సీఎం కేసీఆర్‌ను కలిసిన కొరియన్ సంస్థ ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వాటర్ గ్రిడ్ కనెక్టింగ్ సిస్టం, సోలార్ విద్యుత్ ప్లాంట్లు తదితర జాతీయస్థాయి ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటామని కొరియన్ ఎన్విరాన్‌మెంటల్ కార్పొరేషన్ (కేఈసీవో) ఆసక్తి చూపింది. కేఈసీవో డెరైక్టర్ జనరల్ జీ-సియోక్ జియోన్ తన సహచరులతో కలసి బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు.

ఈ విజ్ఞప్తిని  పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు తన కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగించాలని సంస్థ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. కొరియన్ పర్యావరణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగం ద్వారా ప్రజా జీవనాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement