ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వాటర్గ్రిడ్ మిషన్ను ప్రారంభించామని, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేస్తోందని మంత్రి కే టీ రామారావు అన్నారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. వాటర్గ్రిడ్పై కాంగ్రెస్ నేతలకు అవగాహనలేకపోతే పూర్తి క్లారిటీ కల్పిస్తామన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుకు భారీగా నిధులు మళ్లీస్తే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోన్న పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్లతో వాటర్గ్రిడ్ పథకాన్ని కాంగ్రెస్ నేతలు చేపడితే అన్ని కాంట్రాక్టులు వారికే కేటాయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.
'కాంగ్రెస్కు క్లారిటీ కల్పిస్తాం'
Published Sun, Apr 5 2015 4:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement