critisises
-
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
వీణవంక(హుజూరాబాద్): ‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది, నేను నియోజకవర్గానికి వస్తే ఆయనకు అంత భయం ఎందుకు? పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తాను. ఈటల టీఆర్ఎస్ పార్టీలోకి మధ్యలోనే వచ్చిండు..మధ్యలోనే పోయిండు’’అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్‌లో గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు, సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రజలకోసం రాజీనామా చేశారని, మరి ఈటల ఎవరికోసం ఎందుకోసం రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రైల్వేలు, రోడ్లను అమ్మి వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డా.. 2001లోనే అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఎంపీపీలు..జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉందని, అప్పటికి ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. హుజూరాబాద్ గులాబీ జెండా అడ్డా అని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ అయిన శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ విజయ, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
అయినా.. తీరు మారలేదు !
సాక్షి, నెల్లూరు : ‘స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. వారి బాధలు విని న్యాయం చేయాలి’ అని చెప్పిన ఉన్నతాధికారుల ఆదేశాలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. సిబ్బంది స్టేషన్‌కు వచ్చే వరితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మరిస్థితి మరోలా ఉంది. అడపాదడపా చోటుచేసుకుంటున్న ఘటనలు దీనిని రుజువు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో సంతపేట పోలీస్‌స్టేషన్‌లో పరిస్థితి అధ్వానంగా మారిందనే విమర్శలున్నాయి. స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది స్టేషన్‌కు వెళ్లేవారితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత అధికారులను కలవాలంటే అనేక అవమానాలను దిగమింగాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్లోకి అడుగుపెడితే చాలు ‘ఎవరు రా? ఎందుకు వచ్చారు రా?’ అంటూ ప్రశ్నించడమే కాకుండా బయటకు పోండి రా? అధికారులు ఉన్నప్పుడు రండి? అంటూ ఫిర్యాదుదారులను, ఇతరులను బయటకు పంపివేస్తున్నారు. దీంతో వారు అధికారులు వచ్చేంతవరకూ స్టేషన్ బయట పడిగాపులు కాయాల్సివస్తోంది. రిసెప్షన్ వ్యవస్థలోని ఒకరు మరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ సిబ్బంది ప్రవర్తనపై అదే స్టేషన్లో పనిచేస్తున్న పలువురు సిబ్బంది సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజగా శుక్రవారం ఓ కుటుంబం తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. దీంతో రిసెప్షన్లో ఉన్న ఓ సిబ్బంది వెంటనే వారివద్దకు వచ్చి ‘ఇంతమంది ఎందుకు వచ్చారు రా’ అంటూ వారిని నిలదీశారు. అంతేకాకుండా ‘అక్కడున్న పిల్లలను బయటకు వెళ్లిపోండిరా.. లేదంటే లోపలవేసి నాలుగు తగిలాస్తా’ అని పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలోని పిల్లలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని ఇసుక ట్రాక్టర్లు, టైరుబండ్ల వ్యాపారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వారితో సైతం సదరు రిసెప్షన్ సిబ్బంది అమర్యాదగా వ్యవహరించి స్టేషన్ బయటకు పంపివేశారు. దీంతో వారు స్టేషన్ బయట పడిగాపులు కాశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
బీజేపీ పాలనలో ముస్లింలకు భద్రత కరువు
హుజూర్నగర్ నల్గొండ : దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పాలనలో అభద్రతతో జీవనం సాగిçస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని షాదీఖానాలో ఆయన ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. బీజేపీ అనుబంధ సంస్థలు ముస్లిం మైనార్టీల వేష, భాష, తినే తిండిపై కూడా ఆంక్షలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. మోదీ పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైందని అన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి ఎన్నికల నుంచి జీఎస్టీ బిల్లు వరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలుకుతుందని అన్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయవద్దన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటివారు పనిచేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు మద్దతు పలకాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ గులాంబియాబానీ, రాష్ట్ర మైనార్టీ మాజీ కమిషనర్ అబ్దుల్ రసూల్ ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోహెల్బాయ్, మాజీ వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు జబ్బార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గందరగోళంగా సినిమా రంగం: చాడ
సాక్షి, హైదరాబాద్ : సినిమా రంగంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు గత కొద్దిరోజులుగా బహిర్గతం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ మాఫియా చర్చనీయాంశంగా మారిందన్నారు. మరోవైపు థియేటర్లు ఒక వర్గం గుప్పిట్లో పెట్టుకుని, మిగతా వాళ్లు ఎంత మంచి సినిమాలు తీసినా వాటి ప్రదర్శనకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. సామాజిక చిత్రాలను నిర్మిస్తున్న ఆర్.నారాయణమూర్తి లాంటి వారికి అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ రంగంలోనూ కార్పొరేటీకరణ తిష్ట వేసిందని, ఇలాంటి పెడధోరణులకు కారణమవుతున్న వారిని శిక్షించాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
'ఆ జీవో ఇచ్చింది బాబు చిరకాల మిత్రుడే'
-
నిజాం కంటే రెండింతల ఇల్లు నీకెందుకు?
- కేసీఆర్‌పై మండలిలో ప్రతిపక్ష ఉప నేత షబ్బీర్ అలీ మండిపాటు హైదరాబాద్: నిజాం నవాబు నివాసం 7 ఎకరాల్లో ఉంటే, అంతకంటే రెట్టింపుగా.. సీఎం కేసీఆర్‌కు 14 ఎకరాల్లో నివాసం ఎందుకని శాసనమండలిలో ప్రతిపక్ష ఉపనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనివర్సిటీలు రాజదర్బార్లా, ఇదేమైనా రాజుల కాలమా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ ఆచరణలోనూ చూపించాలన్నారు. కేసీఆర్, అతని భార్య ఇద్దరే ఉండడానికి 14 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇద్దరికోసం 500 గజాల్లో ఇళ్లు కట్టుకుని, మిగిలిన భూమిలో 20 వేల మంది పేదలకు ఇళ్లు కట్టించాలని సూచించారు. టీఆర్ఎస్ కార్యాలయానికి 4,840 గజాల భూమిని రూ.వంద గజం చొప్పున 2004లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, 1700 గజాలు ఎక్కువగా పక్కనే ఉన్న నాలా భూమిని టీఆర్ఎస్ కార్యాలయం కోసం కబ్జా చేశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కేసీఆర్ నివాసం కోసం తీసుకున్న భూమిని, టీఆర్ఎస్ కార్యాలయం కోసం ఆక్రమించిన నాలా భూమితో వేలాది మంది పేదలకు ఇళ్లు కట్టించాలని సూచించారు. -
'ఎన్నికల కోసమే ఇళ్ల ప్రతిపాదన'
మహబూబ్‌నగర్(నాగర్‌కర్నూల్): ఓయూ విద్యార్థులకు పరిపక్వతలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆక్షేపించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తానని చెబుతున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దీనికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని నాగం డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతలంతా గోబెల్స్ వారసులే: కర్నె
హైదరాబాద్: అబద్ధపు ప్రచారం చేయడంలో టీటీడీపీ నేతలు గోబెల్స్‌ను మించిపోయారని, వారంతా గోబెల్స్ వారసులేనని టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఏపీలో రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్సీ పూల రవీందర్ , ఎమ్మెల్యే హన్మంతు షిండే తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలవదని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌కు, హరీష్‌రావు మధ్య పుల్ల పెట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'కాంగ్రెస్‌కు క్లారిటీ కల్పిస్తాం'
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వాటర్‌గ్రిడ్ మిషన్‌ను ప్రారంభించామని, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేస్తోందని మంత్రి కే టీ రామారావు అన్నారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్ నేతలకు అవగాహనలేకపోతే పూర్తి క్లారిటీ కల్పిస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుకు భారీగా నిధులు మళ్లీస్తే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోన్న పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని కాంగ్రెస్ నేతలు చేపడితే అన్ని కాంట్రాక్టులు వారికే కేటాయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.