
సాక్షి, హైదరాబాద్ : సినిమా రంగంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు గత కొద్దిరోజులుగా బహిర్గతం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ మాఫియా చర్చనీయాంశంగా మారిందన్నారు. మరోవైపు థియేటర్లు ఒక వర్గం గుప్పిట్లో పెట్టుకుని, మిగతా వాళ్లు ఎంత మంచి సినిమాలు తీసినా వాటి ప్రదర్శనకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. సామాజిక చిత్రాలను నిర్మిస్తున్న ఆర్.నారాయణమూర్తి లాంటి వారికి అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ రంగంలోనూ కార్పొరేటీకరణ తిష్ట వేసిందని, ఇలాంటి పెడధోరణులకు కారణమవుతున్న వారిని శిక్షించాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment