హైదరాబాద్: అబద్ధపు ప్రచారం చేయడంలో టీటీడీపీ నేతలు గోబెల్స్‌ను మించిపోయారని, వారంతా గోబెల్స్ వారసులేనని టీఆర్‌ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఏపీలో రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్సీ పూల రవీందర్ , ఎమ్మెల్యే హన్మంతు షిండే తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్ గెలవదని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌కు, హరీష్‌రావు మధ్య పుల్ల పెట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.