సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు భూసేకరణ నిమిత్తం ఆర్డినెన్స్‌ను తెస్తూ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(3) ప్రకారం తెలంగాణ వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్స్ ఆర్డినెన్స్ 3/2015ను గెజిట్‌లో ప్రచురించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.