
పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లే
నల్గగొండ : బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. గతంలో ఇలాగే పార్టీలు మారినవారు కాలగర్భంలో కలిసిపోయారని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా గుత్తా ...బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
అధికారుల బదిలీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారని గుత్తా ఆరోపించారు. వాటర్ గ్రిడ్లు కుంభకోణాలకు దారి తీస్తాయని ఆయన విమర్శించారు. పైప్లైన్ల కంపెనీలను పోషించేందుకే వాటర్ గ్రిడ్ పథకం అని గుత్తా అన్నారు. స్కామ్ల కోసమే దగ్గర నీటిని వదిలి...వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.