దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం | water grid project allocates to irresponsible wapcos | Sakshi
Sakshi News home page

దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం

Published Wed, Nov 18 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం

దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం

సందర్భం
ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నీటి సరఫరా పనుల్లో ఏ ప్రమాణాలనూ వాప్‌కోస్ పాటించలేదు. అలాంటి వాప్‌కోస్‌ను తెలంగాణకు శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్యవేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా?
 
 వాటర్ అండ్ పవర్ కన్సె ల్టెన్సీ (వాప్‌కోస్) తెలంగాణలో అత్యంత వివాదాస్పద మైన సంస్థగా ప్రజలముందు నిలుస్తోంది. కార్పొరేట్ దోపిడీ లీలలు ప్రజలు పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో వెలుగు చూడటమే కలవరపెడుతోం ది. వైఎస్ హయాంలో వాప్ కోస్ డీపీఆర్ ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టును చేపట్టగా 9 వేల కోట్ల పనులయ్యాయి. తెలంగా ణకు ఎనలేని మేలు చేసే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి తుమ్మిడి హెట్టి అన్ని విధాల అనువైనదని ఆనాడు వాప్‌కోస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వాప్‌కోస్ గత డిజైన్‌లోనే 1,500 కోట్ల పనులు చేసిందనేది గమనిం చాలి. ప్రాణహితపై వాప్‌కోస్ ఇచ్చిన నివేదికను ఆ సంస్థే తలకిందులు చేసి, కాళేశ్వరం-మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చి వేల కోట్ల దుర్వినియోగం చేసి, నిర్మించిన భారీ కాలువలు నిరుపయోగమయ్యాయి.


 తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, విశ్రాంత ఇంజనీర్లు, వారి సంఘాలు, మేధావులు, ప్రజలందరు ఈ రీడిజైన్‌ను వ్యతిరేకించి ఉద్యమిస్తూనే ఉన్నాయి. వ్యాప్‌కోస్ మేడిగడ్డ సర్వేకు అనేక కోట్ల ఫీజు తీసుకొని, లైడార్ లేజర్ సర్వే చేసి, కాళేశ్వరం నుండి ఎల్లంపెల్లికి కాల్వ, సొరంగానికి 150 క్రాసింగ్‌లు, అడ్డంకులున్నాయని, అసాధ్యమని తేల్చి, ప్రతిపాదించిన ప్రభుత్వమే ఈ రీడిజైనింగును రద్దు చేసింది. ఎల్లంపెల్లి నుండి దారిలో ఉన్న జిల్లాలు, హైద రాబాద్‌కు నీరందించే పథకంలో వాప్‌కోస్ చేస్తున్న ఘోరమైన తప్పులపై మెట్రో వాటర్ వర్క్స్ దుమ్మెత్తి పోసింది. వాప్‌కోస్ ఏ ఒక్క తప్పును సరిదిద్దుకోకపోగా, జవాబిచ్చే బాధ్యతనూ విస్మరించింది.


 'మౌలానా అబ్దుల్ కలాం హైదరాబాద్ సుజల స్రవంతి' గోదావరి తాగునీటి పథకం దశ-1తో ఎల్లంపెల్లి నుండి హైదరాబాద్‌కు నీళ్లు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పథకంపై సర్వేకు వాప్‌కోస్‌ను నియ మించారు. ఈ పథకం అకౌంట్స్ జనరల్ 17.11.2012న వాప్‌కోస్ తప్పులపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. వాప్ కోస్ అర్హత, అనుభవం లేని ఇంజనీర్లను వినియోగిస్తుం దని. ఒక ప్యాకేజీలో ఉన్న అదే పేర్లు గల ఇంజనీర్లనే మరో ప్యాకేజీలో వినియోగిస్తుందని నిర్దిష్టంగా వాప్ కోస్‌ను ఆ లేఖలో తీవ్రంగా మందలించింది.


 మెట్రో వాటర్‌వర్క్స్ డీజీఎం వాప్‌కోస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు రాసిన మరో లేఖలో వాప్‌కోస్ తప్పులను తూర్పారబట్టారు. అర్హత, ఏ మాత్రం అనుభవం లేని యువ ఇంజనీర్లను నియమిస్తున్నారు. 14 మంది సీని యర్ ఇంజనీర్లు ఉండవలసిన చోట, కేవలం ఎలాంటి అర్హత, అనుభవం లేని అప్పుడే చదువులు పూర్తి చేసు కున్న ఆరుగురు జూనియర్ ఇంజనీర్లను,  సర్టిఫికెట్లు కూడా రాని ఇంజనీర్లను వాప్‌కోస్ కారు చౌక జీతాలు చెల్లించి కుదుర్చుకుంది. అనుభవలేమితో ప్రాజెక్టుల భవిష్యత్తునే వాప్‌కోస్ ప్రశ్నార్థకం చేస్తోంది.


 కేంద్ర నీటిశాఖ నిబంధనల ప్రకారం వ్యాప్‌కోస్ పనిచేస్తున్న రాష్ట్రాలలో అత్యున్నత సాంకేతిక సౌకర్యా లతో సెంట్రల్ లాబొరేటరీ ఉండాలి. అన్ని సాంకేతిక వసతులున్న మొబైల్ లాబొరేటరీ ఉండాలి. కానీ వాప్ కోస్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిది పక్కకు పెడితే ఏ స్థాయి పరిశోధనా సంస్థాలేదు. ప్రమాణాలను పాతరేసిన వీరి తప్పుడు నివేదికల ఆధారంగా వేల కోట్లతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఎన్నిచోట్ల పేలుతున్నాయో చూస్తూనే ఉన్నాం.


 గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీమ్ ప్రాజెక్టు ఫేస్-1, ప్యాకేజీ-2లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న పీఎస్ కాశీనాథ్ (రిటైర్డ్ సీఈ) వాప్‌కోస్‌కు, హెచ్‌ఎం డబ్ల్యూఎస్‌ఎస్‌బీకి తేది 3.8.2013న లేఖ రాశారు. ప్రతి ప్యాకేజీలో 14 మంది 15 సంవత్సరాలు ఆపై అర్హత, అనుభవంగల ఇంజనీర్లుండాలని, సెంట్రల్ ట్యాబ్, మొబైల్ ట్యాబ్ ఉండాలనీ, అయితే అమలు చేయవల సిన వాప్‌కోస్ పీడీ దీనికి విరుద్ధంగా ప్యాకేజ్-1ను ఏ మాత్రం అనుభవం లేని ఉప కాంట్రాక్టర్లకిచ్చారు. ఉప కాంట్రాక్టర్లకు ఇవ్వడం అగ్రిమెంట్ నిబంధనలకు విరు ద్ధం. జీతాలివ్వని వారిని, జీతాల గురించి దీనంగా అడ గడానికి వెళ్లిన పేద ఇంజనీర్లను, వాప్‌కోస్ పీడీ, నాకు మీ జీతాలతో ఎలాంటి సంబంధం లేదని బుకా యించారు.

 సర్వే పనులు సాగుతున్న చాలా పని స్థలాల వద్ద వాప్‌కోస్‌కు ఎక్కడా ఒక కార్యాలయం, ప్రాజెక్టు మేనే జర్ లేరు. 3, 4 గురు అనుభవంలేని ఇంజనీర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. అదే సమయంలో ప్రభుత్వాల నుండి 14 మంది సీనియర్ ఇంజనీర్ల పేర కోట్లు కాజేస్తోంది. వాప్‌కోస్ దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలోనూ మారక పోగా మరింత పెరిగింది. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ల గురించి వాప్‌కోస్ లక్ష్యాలుగా చెప్పుకొంటుంది. కానీ ఈ ఏ అర్హతలు వాప్ కోస్‌కు లేవు.

ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు జరి గిన నీటి సరఫరా పనులలో పై ఏ నియమాలను, ప్రమా ణాలను వాప్‌కోస్ పాటించలేదు. పైగా తుంగలో తొక్కింది. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నిర్మిం చిన పైపులతో నీళ్లందించినప్పుడు పాటించిన ప్రమా ణాలెంతటివనేది తేలుతుంది. అలాంటి వాప్‌కోస్‌ను తెలంగాణ జనావళికి శాశ్వతంగా ఉపయోగపడే సాగు, తాగునీరును అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్య వేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? ప్రమా ణాలు పాటించని, పైసలే ప్రమాణాలైన వాప్‌కోస్‌కు ఎలాంటి టెండర్లు లేకుండా తెలంగాణ వాటర్ గ్రిడ్ కన్సెల్టెన్సీగా నెలకో కోటితో ప్రభుత్వం కట్టబెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేమిటో తెలంగాణ ప్రభు త్వమే వెల్లడించాలి.

http://img.sakshi.net/images/cms/2015-04/51428439879_160x120.jpg


వ్యాసకర్త: తెలంగాణ జలసాధన సమితి కార్యదర్శి, నైనాల గోవర్ధన్.

   మొబైల్:9701381799

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement