నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు | Ata Done Many Financial Support Service In Nagar Kurnool District | Sakshi
Sakshi News home page

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు

Published Wed, Dec 13 2023 10:22 AM | Last Updated on Wed, Dec 13 2023 10:22 AM

Ata Done Many Financial Support Service In Nagar Kurnool District  - Sakshi

పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్‌కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్‌సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు.

ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement