ATA SEVA
-
'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ
ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా, భారత్‌లోని పాఠశాలల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్‌ను మరింత అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్‌కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!) -
చికాగోలో తెలుగు విద్యార్థి మృతి.. ‘ఆట’ సహాయం
చికాగో : నగరంలో నాగరాజు అనే తెలుగు విద్యార్థి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నేపర్‌విల్లే వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్తతో అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి కుటుంబానికి సహాయం చేయటానికి ‘‘అమెరికా తెలుగు అసోషియేషన్ (ఆట)సేవ బృందం’’ ముందుకొచ్చింది. ఆట తరుపున మహిపాల్ రెడ్డి గురువారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆట సేవ బృందం తరుపున వారికి సహాయం చేయనున్నారు. ఆట సేవ బృందం ప్రతినిధి మాట్లాడుతూ.. తాను ఈ ఉదయమే మృతుడి కుటుంబాన్ని కలిశానన్నారు. అతడి కుటుంబం షాక్ గురై ఉందని వారికి సహాయం అవసరమని తెలిపారు. తాను నాగరాజు తమ్ముడితో మాట్లాడానన్నారు. అతని కుటుంబసభ్యులు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులు గురువారం ఉదయం భారతదేశం నుంచి చికాగోకు రాబోతున్నట్లు వెల్లడించారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఆట’ వారికి అండగా ఉంటుందని తెలిపారు. వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని తమ చికాగో టీమ్ అందిస్తుందని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 1 నుంచి 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైద్య పరమైన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆటా కార్యనిర్వాహక సభ్యులందరూ అమెరికా నుంచి భారత్ వచ్చి సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నట్టు పర్మేష్ భీంరెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా నిర్వహించనున్న ఈ సేవా కార్యక్రమాల తేదీల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేదలకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, వైద్య సహాయంతోపాటూ మందుల పంపిణీ కూడా చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో వివిధ కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నట్టు తెలిపారు. ఆటా కార్యనిర్వాహక బృంద సభ్యులు కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి(ఆటా ప్రెసిడెంట్), పర్మేష్ భీంరెడ్డి(ప్రెసిడెంట్ ఎలక్ట్), కిరణ్ రెడ్డి పాశం, అనిల్ బొద్ది రెడ్డి, వేణు పిస్కె, వెంకట్ వీరనేని, శ్రీధర్ తిరుపతి, శివకుమార్ రామడ్లులు సమావేశమై ఈ సేవా కార్యక్రమాలని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.