'కల్కి' సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సాయం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్‌లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్)
ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ‍్విన్.. 'మహానటి' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మధ్య 'కల్కి'తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
(ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం)
Comments
Please login to add a commentAdd a comment