సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుడికిల, నార్లాపూర్ గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం పదిమందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాలకు ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమది అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment