సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: బీఆర్‌ఎస్‌కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?. ఆయన బీఆర్‌ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూసిన జనార్దన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఢిల్లి పెద్దలలో మర్రి మంతనాలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment