marri janardhan reddy
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: బీఆర్ఎస్కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూసిన జనార్దన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఢిల్లి పెద్దలలో మర్రి మంతనాలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్! -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం
సాక్షి, మహూబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సహనం కోల్పోయి ప్రజలపై చిందులు వేశారు. కోపం తట్టుకోలేక కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. ఇదంతా విన్న ప్రజలు నిస్తుపోయారు. గత మూరు రోజులుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏళ్ల ప్రజాప్రస్థానం పేరుతో నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తెలకపల్లి మండలం బొబ్బిలిలో యాత్ర కొనసాగింది. రాత్రి 9 గంటలకు గ్రామంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రసంగం సందర్భంగా అల్లరి చేశారు. ప్రసంగాన్ని అడ్రుకునే ప్రయత్నం చేశారు. దీనితో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క సారిగా ఆవేశానికి గురయ్యారు. ప్రత్యర్థి వర్గాన్ని దూషిస్తూ వేదికపై నుండి విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. తిట్ల పురాణంతో దూషణలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆవేశపూరిత మాటలతో గందరగోళం నెలకొంది. చదవండి: దిశా కేసులో కీలక మలుపు.. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న విచారణ అధికారి -
TS: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ నాగం జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై సోమవారం తీర్పు వెల్లడించింది. 2018లో నాగం జనార్ధన్‌రెడ్డిపై మర్రి జనార్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో కొన్ని వివరాలు దాచి పెట్టారని ఆరోపిస్తూ.. మర్రి జనార్ధన్‌రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తన పిటిషన్లో ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలన్న నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలంపాట -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
ఐటీ సోదాల పేరిట హడావిడి చేశారంతే!: పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు ముగిశాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుగంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు మొదలైన సంగతి విదితమే. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోదాలు ముగిసినట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు రోజుల సోదాల్లో.. కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ఐటీ ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. అలాగే పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. ఇక చివరగా సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల పరిణామంపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. బురదజల్లే ప్రయత్నం BRS నేతలను లక్ష్యంగా చేసుకుని.. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు జరిగాయన్న ఆయన.. సోదాల వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. ‘‘ఐటీ సోదాల గంటలోనే ముగిసినప్పటికీ.. అధికారులు 3రోజుల పాటు కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారలతో నాకు సంబంధం లేదు. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలున్నాయన్నది పచ్చి అబద్ధం. మర్రి జనార్దన్, కొత్త ప్రభాకర్లతో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించి పైల్స్ తీసుకున్నారంతే. సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నాం. నేను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారు అధికారులు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు...అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు... కానీ ఏమీ దొరకలేదు. ఐటీ అధికారులకు మా సీఏ పూర్తి వివరాలు ఇచ్చారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారాయన. డాక్యుమెంట్లు కీలకమైనవే! ఇదిలా ఉంటే.. ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? -
బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు.. 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల నివాసాల్లో మూడో రోజు కూడా ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి సహా లైఫ్‌స్టైల్ మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఐటీ శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి భార్య, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ భాగస్వామ్యం, వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో మధుసూదన్‌రెడ్డి లావాదేవీలపైనా విచారణ చేస్తున్నారు. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థతో ఒప్పందాలపై దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్పైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, గురువారం కూడా వారి కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీశారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. గురువారం రోజున ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/దిల్సుఖ్నగర్/ముషీరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 36లో ఉన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో వారి కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి... పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు. సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్ ఆరోపించారు. -
ముగిసిన సోదాలు.. బీఆర్ఎస్ ఎంపీకి నోటీసులిచ్చిన ఐటీ అధికారులు
సాక్షి, మెదక్: తెలంగాణ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
ఒక్కటికానున్న 220 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కార్యకర్తల బలంతోనే..: జనార్దన్‌రెడ్డి కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా. -
రైలు కిందపడి చావాలనుకున్నా.. బతికి సాధించా: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘వ్యాపారం, రాజకీయాల్లోకి రాకముందు నేను కూడా ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. రైలు కిందపడి చనిపోయేందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లా. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నా. జీవితంలో పైకి ఎదగాలనే పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యాను. ఒకప్పుడు పనిలేని స్థాయి నుంచి.. ఇప్పుడు 7 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాను’.. అని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఒకప్పుడు నాన్నతో గొడవపడి కేవలం రూ.30తో హైదరాబాద్ వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన వివరించారు. యువత ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని హితవు పలికారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! -
Telangana: కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందే!
నాగర్ కర్నూల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్య అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన నాగం జనార్థనరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తెలుగుదేశం అంతర్థానం తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కకపోవడంతో ప్రస్తుతం హస్తం పార్టీలో కాలం వెళ్ళదీస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మర్రి జనార్థనరెడ్డి కారు గుర్తు మీద ఇక్కడి నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మర్రి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జిల్లా పర్యటకు వచ్చినపుడు బహిరంగంగానే మర్రి పోటీ గురించి ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదరరెడ్డితో మర్రి జనార్థనరెడ్డికి అసలు పడదనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో తన కేడర్‌పై కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదరరెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డిపై మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కూచుకుళ్ళ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి ఈసారి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగం జనార్థనరెడ్డి వయస్సు మీదపడటం, కాంగ్రెస్ కేడర్‌లో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి టీఆర్ఎస్లో సీటు రాకపోతే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగం, కూచుకుళ్ళ మధ్య సయోధ్య కుదిరితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాగంకు సముచిత స్థానం ఇస్తామని పెద్దల నుంచి హామీ వస్తే నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చు. కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ సీటుగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించిన గువ్వల బాలరాజ్ మూడోసారి కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది. బాలరాజ్ వ్యవహారశైలి కారణంగా కేడర్‌లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్నదేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆమ్రాబాద్‌లో మంచినీటి సమస్య, పోడు భూముల సమస్య ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో కూడా బాలరాజ్‌కు నెగిటివ్ నివేదికే వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేడర్ తిరిగి వస్తుండటంతో తమ విజయం తథ్యమని హస్తం పార్టీ భావిస్తోంది. డాక్టర్ వంశీకృష్ణ భార్య ఆమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనూరాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా అచ్చంపేటలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇటీవల కర్నాటక డీజీపీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్‌తో బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి మహేంద్రనాథ్ కుమారుడైన రవీంద్రనాథ్ అయితే మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ కమలం గుర్తుకే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వీరిద్దరి మధ్య రెండు వర్గాలుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో జైపాల్‌కు కసిరెడ్డి సహకరించకపోయినా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా గ్యాప్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్యా సయోధ్యకు పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నించలేదు. వంశీచందర్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించి..ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండున్నరేళ్ళుగా వంశీచందర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ కాంగ్రెస్‌లోకి చేరేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. కాని సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిన తల్లోజు ఆచారినే ఈసారి కూడా బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి ఓటమి చెందారు. తర్వాత హర్షవర్థన్ కారు పార్టీలోకి జంప్ చేశారు. ఇక అప్పటినుంచీ ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది. ఇద్దరి వర్గీయులు ఎవరికి వారు ఈసారి సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే జూపల్లి పార్టీ మారతాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ మారితే పాతగూడు కాంగ్రెస్‌లో చేరతారా? లేక కాషాయ జెండా పట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జగదీశ్వరరావు ఆసక్తి చూపిస్తున్నారు. హర్షవర్థన్‌రెడ్డి పార్టీ వీడాక కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం కరువైంది. -
‘బుద్ధ విగ్రహం ఏర్పాటులో లక్షల రూపాయల అవినీతి’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా : కేసరి సముద్రం చెరువు కట్ట మరమ్మత్తులో మర్రి జనార్ధన్ రెడ్డి భారీ అవినీతికి పల్పాడ్డారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసరి సముద్రం చెరువు మరమత్తులో మర్రి జనార్దన్ రెడ్డి వందల కోట్ల ప్రజధనాన్ని లూటీ చేశారంటూ మండిపడ్డారు. చెరువు కట్టపై జరిగిన సీసీ రోడ్ల నిర్మాణంలో టెండర్లు ఆమోదం కాకుండానే.. అగ్రిమెంట్లు లేకుండానే పనులు ఎలా జరిగాయో చెప్పాలంటూ మర్రి జనార్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు. చెరువు కట్టపై నాలుగు కోట్ల రూపాయల అభివుద్ధి పనులు కూడా జరగలేదు.. కానీ పదిహేడున్నర కోట్ల రూపాయల పనులు జరిగినట్లు చెప్తున్నారంటూ మండిపడ్డారు. బుద్ధ విగ్రహం, దిమ్మెలైట్లు ఇతర మెటీరియల్ ఏర్పాట్లలో లక్షల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంట్రక్టర్ నల్లమట్టిని వందల కోట్ల రూపాయలకు అమ్ముకుని.. వేల ఎకరాల పంట భూమిని ఎండ పెట్టారు.. ఇదెక్కడి న్యాయమంటూ నాగం ప్రశ్నించారు. -
క్షేత్రస్థాయిలోనే అవినీతి బయటపెడతా
సాక్షి, నాగర్‌కర్నూల్: మూడేళ్లలోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆ యన అనుచరులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వీటిని ఆలయా ల వద్ద చ ర్చించడం కాదని, క్షేత్రస్థాయిలో నే చిట్టా విప్పుతానని బీజేపీ నేత నా గం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మర్రి తనను బహిరంగచర్చకు ఆహ్వానించి ఉమామహేశ్వరంలో వేదిక ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని, అవినీతి జరిగిన చోటే చర్చిద్దాం రమ్మని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తాను బహిరంగ చర్చలో పాల్గొనాల్సి వస్తే సీఎం కేసీఆర్‌తో కూర్చుని పాత్రికేయుల ముందే ఆయన బండారాలు బయట పెడతానని, సీఎంను తనతో బహిరంగ చర్చకు వచ్చేవిధంగా ఎమ్మెల్యే ఒప్పించాలని నాగం సూచించారు. ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా మర్రి జనార్దన్‌రెడ్డి రూ.12కోట్లు వెచ్చించి పేదలకు పెళ్లిళ్లు చేశానని ప్రకటించారని, ఒక్కో జంటకు ఎంత ఖర్చు చేశారో లెక్క చూపించాలన్నారు. రూ.12కోట్లు ఖర్చు చేస్తున్న ఎమ్మెల్యే పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారో బయట పెట్టాలన్నారు. రాంచంద్రారెడ్డి, అర్థం రవి, కాశన్న, నసీర్ ఉన్నారు. -
'తెలంగాణ చుట్టంగా మారిన కరువు'
హైదరాబాద్ : వలస పాలనలో పాలమూరు జిల్లా బాగా వెనకబడిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అంటే కేవలం కరువు జిల్లాగా పేరు పడిందన్నారు. రాష్ట్రంలో కరువు, జంటనగరాల్లో తాగునీటి సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... కరువు అనే మహమ్మారి తెలంగాణకు చుట్టంగా మారిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైందన్నారు. పాలమూరు, డిండి, సీతారాం, భక్త రామదాసు ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం అకుపచ్చగా కళకళలాడుతుందని చెప్పారు. గత పాలకుల హయాంలో 40 ఏళ్లు అయిన తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం చారిత్రక ఒప్పందమని చెప్పారు. రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచెందుకు హరితహరం చేపట్టినట్లు మర్రి జనార్దన్‌రెడ్డి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మర్రి జనార్దన్ రెడ్డి వివరించారు. -
బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాయడంపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. ఆ లేఖను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం చేపట్టిన బంద్‌లో పెద్దఎత్తున పా ల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన బంద్ సక్సెస్ అయిం ది. టీఆర్ఎస్ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే ఆర్టీసీ డి పోల ఎదుట బైఠాయించడంతో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్‌కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఎమ్మెల్యే ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు బంద్ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్చర్లలో ర్యాలీ నిర్వహించారు. జడ్చర్ల, మిడ్జిల్‌లో టీడీపీ జెండా దిమ్మెలను కూలగొట్టారు. భూత్పూరులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిలు ర్యాలీ నిర్వహించారు. కొత్తకోట మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్‌లో దుకాణాలు మూసివేయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అచ్చంపేటలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో చేశారు. డిపో వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేయించారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించారు. బొంరాస్‌పేట మండలం దుద్యాలలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. అలంపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బంద్ సందర్భంగాఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు మాట్లాడుతూ తెలంగాణ పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. పాలమూరు ప్రజలకు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ శాపంగా మారనుందని.. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. -
మర్రి జనార్ధన్‌రెడ్డి కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి
మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వివాదాలు నెలకొంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి మర్రి జనార్ధన్‌రెడ్డి కాన్వయ్పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. దాంతో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. మరోవైపు గద్వాల మండలం గాజులపల్లిలో ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కార్యకర్తలను చెదరగొట్టిన ఘటనలో పదిమంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రాముడి అవతారంలో కేసీఆర్!
నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం జరిగిన కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా కోడ్ ఉల్లంఘించారని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి కీమ్యానాయక్ నోటీసులు జారీచేశారు. బహిరంగసభ ప్రవేశ ద్వారం వద్ద ధనుస్సు, బాణాలు ధరించిన శ్రీరాముడి అవతారంలో కేసీఆర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సభను ఎన్నికల బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరిశీలించి వీడియో, ఫొటోలు తీశారు. ఎన్నికల్లో మతపరమైన అంశాలతో కూడిన ప్రచారం చేయడం కోడ్‌ఉల్లంఘన కిందికి వస్తుందని, రిప్రజెంటేషన్ పీపుల్స్యాక్ట్ (ఆర్పీయాక్ట్) 1951 ప్రకారం 129 సెక్షన్ కింద కేసునమోదు చేశామని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి ‘మర్రి’ వాహనం బోల్తా
ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయూలు నాగర్‌కర్నూల్, నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర జిల్లా నాగర్‌కర్నూలు శివారులో జరిగింది. వివరాలు.. మర్రి జనార్దన్‌రెడ్డి అనుచరులు ఆదివారం ప్రచారం ముగించుకొని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో (ఏపీ 22 ఏడీ 9999) ఇన్నోవా వాహనంలో బిజినేపల్లికి చెందిన ఓ మండల నాయకుడిని ఇంట్లో వదిలేసి తిరుగు ప్రయూణమయ్యూరు. ఆ వాహనం ఉయ్యూలవాడ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ఎడమవైపు ఉన్న వంట మనిషి భవానీ(35), సెక్యూరిటీ గార్డు నరేష్(23) మృతి చెందారు. డ్రైవర్ రాజుతోపాటు అతని వెనుక ఉన్న కార్యకర్త శివ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడేనికి చెం దిన భవానీ, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నరేష్ కొంతకాలంగా జనార్దన్‌రెడ్డి వద్దే ఉంటున్నారు.