సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ నాగం జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై సోమవారం తీర్పు వెల్లడించింది.
2018లో నాగం జనార్ధన్‌రెడ్డిపై మర్రి జనార్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కొన్ని వివరాలు దాచి పెట్టారని ఆరోపిస్తూ.. మర్రి జనార్ధన్‌రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని కోరారు.
దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలన్న నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలంపాట
Comments
Please login to add a commentAdd a comment