మర్రి జనార్ధన్‌రెడ్డి కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి | Congress, TRS workers clash in Mahabub Nagar disitrict | Sakshi
Sakshi News home page

మర్రి జనార్ధన్‌రెడ్డి కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి

Published Mon, Apr 28 2014 11:59 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

Congress, TRS workers clash in Mahabub Nagar disitrict

మహబూబ్‌నగర్ ‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వివాదాలు నెలకొంటున్నాయి.  మహబూబ్ నగర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.   టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి మర్రి జనార్ధన్‌రెడ్డి కాన్వయ్పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. దాంతో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు.

మరోవైపు గద్వాల మండలం గాజులపల్లిలో ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కార్యకర్తలను చెదరగొట్టిన  ఘటనలో పదిమంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement