టీఆర్‌ఎస్ అభ్యర్థి ‘మర్రి’ వాహనం బోల్తా | TRS candidate 'ficus'   Vehicle roll over | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అభ్యర్థి ‘మర్రి’ వాహనం బోల్తా

Published Tue, Apr 22 2014 2:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

TRS candidate 'ficus'    Vehicle roll over

ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయూలు

నాగర్‌కర్నూల్,  నాగర్‌కర్నూలు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర జిల్లా నాగర్‌కర్నూలు శివారులో జరిగింది.  వివరాలు.. మర్రి జనార్దన్‌రెడ్డి అనుచరులు ఆదివారం ప్రచారం ముగించుకొని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో (ఏపీ 22 ఏడీ 9999) ఇన్నోవా వాహనంలో బిజినేపల్లికి చెందిన ఓ మండల నాయకుడిని ఇంట్లో వదిలేసి తిరుగు ప్రయూణమయ్యూరు. ఆ వాహనం ఉయ్యూలవాడ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.

అందులో ఎడమవైపు ఉన్న వంట మనిషి భవానీ(35), సెక్యూరిటీ గార్డు నరేష్(23) మృతి చెందారు. డ్రైవర్ రాజుతోపాటు అతని వెనుక ఉన్న కార్యకర్త శివ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడేనికి చెం దిన భవానీ, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నరేష్ కొంతకాలంగా జనార్దన్‌రెడ్డి వద్దే ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement