
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురువయ్య(40)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు శివ(9)కు ఈత నేర్పేందుకు తండ్రి రోజూ గ్రామ శివారులోగల అమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వెళ్లిన వారు రాత్రి వరకు తిరిగి రాలేదు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్‌ను ఆశ్రయించారు. ఆయనతోపాటు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా కొత్తబావి గట్టుపై దుస్తులు కనిపించాయి. బావిలో వెతుకగా శివ, గురువయ్యల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.