
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
– కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా)
నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది.
– రెంజల్(బోధన్)
సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు.
– కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment