
సాక్షి, కొల్లాపూర్: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సురభి రాజా ఆదిత్య బాలాజీ లక్ష్మణ్ రావుపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం కొల్లాపూర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పుడు పని చేయలేదన్నారు. రాజకీయంగా చిన్న మచ్చ కూడా లేదని చెప్పారు. రేపు కొల్లాపూర్‌లో ఎన్టీఆర్ చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి కొల్లాపూర్ రాజా బాగోతం బయట పెడతానన్నారు. స్వార్థ రాజకీయాలు తెలియవని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికే నిత్యం పాటు పడుతున్నానని జూపల్లి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment