ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్‌ఎస్‌ ధీమా.. | Telangana: BRS Hoping Wins 4 Lok sabha Seats Chance To More | Sakshi
Sakshi News home page

ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్‌ఎస్‌ ధీమా..

Published Fri, May 17 2024 6:23 PM | Last Updated on Fri, May 17 2024 6:35 PM

Telangana: BRS Hoping Wins 4 Lok sabha Seats Chance To More

పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్‌ ఉన్నాయంటోంది ఆపార్టీ. 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ  అంచనా వేస్తోంది.

పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా  ఉన్నారు. 

మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పా‌లో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. 

ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్‌ ఎస్‌ పార్టీకి ఇప్పుడు  పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది  జూన్ 4న తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement