కాంగ్రెస్ నేతల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అధికారం అండచూసుకుని అరాచకాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ నేతలను కఠినంగా శిక్షించాలని, వారికి మద్దతిస్తున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, సుధాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు మా ట్లాడుతూ, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌం టర్ తర్వాత.. అతడి నేరాల్లో భాగస్వా ములైన వారిపై చర్యలేమీ తీసుకోలేదని ఆరోపించారు. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడ మే కాకుండా, బాధితులపై దాడికి పాల్పడి న టీఆర్‌ఎస్ నాయకుడిని మంత్రి జగదీశ్ రెడ్డి కాపాడటం దారుణమన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ఓ పిచ్చి నిర్ణయం తీసుకుంటే, దాన్ని కేసీఆర్ సమ ర్థించడం దురదృష్టకరమన్నారు.