
మంత్రుల కుమారుల దౌర్జన్యాలు పెరిగాయి
టీపీసీసీ నేత అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల కుమారుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రుల కుమారులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను అరికట్టకపోతే కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నయీం కేసుల నుంచి అధికారులను రక్షించే పనిని కొందరు మంత్రులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడానికి టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే దానిని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: టీపీసీసీ
కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని టీపీసీసీ అధికార ప్రతి నిధి ప్యాట రమేశ్ ఆరోపించారు. మిషన్ భగీరథ పథకమంతా అవినీతిమయమేనని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వేపై టీఆర్‌ఎస్ నాయకుల విమర్శలు ఆ పార్టీ అభద్రతా భావానికి నిదర్శనమని ఆరోపించారు.