
సాక్షి, అడ్డగూడూరు : టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన బండి మధు మండల పరిధిలోని డి.రేపాక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌తో కలిసి వినూత్న ప్రచారం నిర్వహించారు.
దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా సగం మీసం, సగం గుండు తీయించుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు ఓటువేయాలని ప్రచారం నిర్వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment