సాక్షి, హైదరాబాద్: చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. అయితే రేవంత్ క్షమాపణలను తాను పట్టించుకోనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తనపై పరుష పదజాలం వాడిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాతే రేవంత్ క్షమాపణపై స్పందిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
చదవండి: (కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ)
ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. 'పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ కమిటీ నాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. నోటీసులకు వివరణ ఇచ్చా.. క్షమాపణ కూడా చెప్పా. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను' అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
(వైరలైన అద్దంకి దయాకర్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment