
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రావెల చేపట్టిన దీక్షకు దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment