atrocities act
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు గతంలో ఇచి్చన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా ఉందన్న కేంద్రం వాదనపై తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారంటూ, అట్రాసిటీ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి విచారణను తప్పనిసరి చేస్తూ 2018లో తీర్పు ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వచ్చే వారానికల్లా ఇరు పారీ్టలు లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సూచిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షా, జస్టిస్ బీఆర్ గవైల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. తాము చట్టప్రకారమే కొన్ని సూచనలిస్తామని, అవి సమానత్వాన్ని పెంపొందించేలా ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారన్న కారణంతో చట్టాన్ని తీసేయలేమని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేసింది. కుల ప్రాతిపదికన ఒక వ్యక్తిని (బాధితుడిని) అనుమానిస్తారా ? ఇతర సామాజిక వర్గాల వారు కూడా తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చు అని అభిప్రాయపడింది. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే విచారణ అవసరం లేదని, కానీ ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అధికారి విచారణ అవసరం అనడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. -
కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రావెల దీక్ష
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రావెల చేపట్టిన దీక్షకు దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు -
ఆ తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంను కోరండి
సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నిందితులను అరెస్టు చేయడం తప్పనిసరి కాదంటూ గత నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం వేర్వేరుగా లేఖలు రాశా రు. డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం, ఏఎన్ఆర్ కేసులో తాజా గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని నీరుగార్చే విధంగా ఉందని వైఎస్సార్ సీపీ బలంగా విశ్వసిస్తున్నట్లు ఆ లేఖల్లో జగన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానికి జగన్ రాసిన లేఖల్లోని సారాంశమిదీ... నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది ‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద కేసులు నమోదైన నిందితులెవరినీ తక్షణమే అరెస్టు చేయరాదు. సంబంధిత నియామక అధికారి అనుమతిస్తేనే ఈ కేసులో నిందితులైన ప్రజా సేవకులు / ఉద్యోగులను అరెస్టు చేయాల్సి ఉంటుంది. పోలీసు సూపరింటెండెంటు అనుమతించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులను అరెస్టు చేయాలి. ఈ విషయంలో తగిన కారణాలను రికార్డ్ చేయాలి. తదుపరి విచారణ సమయంలో మేజిస్ట్రేట్ ఈ కారణాలను తప్పనిసరిగా పరిశీలించాలి’అంటూ గత నెల 20వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీకు విదితమే. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందని వైఎస్సార్సీపీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. నిందితుని అరెస్టును అడ్డుకోవడం, దుర్భలుడైన బాధితుని కంటే బలవంతుడైన నిందితునికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాక, తదుపరి దర్యాప్తునకు సైతం అవరోధం కలిగిస్తుంది. అంతేకాక, సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అరెస్ట్ నుంచి నిందితులకు రక్షణ కల్పించినట్లుంది. ఇది అణగారిన వర్గాల హక్కులకు సంరక్షకుడిగా న్యాయస్థానం ఉందన్న తిరుగులేని నమ్మకాన్ని తగ్గించేదిగా ఉంది. వేధింపులు లేని రోజు లేదు... దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు లేకుండా ఒక్క రోజు కూడా గడవటం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన ఈ చట్టాన్ని నీరుగార్చడం వల్ల ఎస్సీ, ఎస్టీల మనోస్థైర్యం దెబ్బతింటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ సమాజంలో ఎస్సీ, ఎస్టీలు అత్యంత అణచివేతకు గురవుతున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధికి నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. సమానావకాశాలకు నోచుకోక, విద్యలో వెనుకబడి పౌష్టికాహార లోపంతో దుర్భర స్థితిలో అల్లాడుతున్నారు. కుల రహిత సమాజమే లక్ష్యం... కుల రహిత సమాజ స్థాపనే మన రాజ్యాంగ లక్ష్యం. అది నెరవేరే వరకూ ప్రభుత్వం అణగారిన వర్గాలకు సమానావకాశాలు కల్పించాలి. ఈ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం – 1989ని బలహీన పరచడాన్ని మనం ఏమాత్రం అనుమతించరాదని వినయపూర్వకంగా కోరుతున్నా. అందువల్ల ఈ తీర్పుపై పునఃసమీక్ష కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలని కోరుతున్నా’అని వైఎస్ జగన్ రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులే ఇలా అవమానిస్తుంటే? 40 ఏళ్లుగా ప్రజాజీవితంలో (రాజకీయాల్లో) కొనసాగుతూ అత్యంత అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు లాంటి వారే ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ‘ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు?’అని ఎస్సీ, ఎస్టీల గురించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఎస్సీలకు శుచి, శుభ్రత ఉండదు. చూడటానికి అసహ్యంగా ఉంటారు. హుందాగా బతకటం తెలియదు.. ’అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకులు ఇలా ఫ్యూడల్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దళితులను అణచివేస్తున్నారు. దళితుల పట్ల ప్రజాజీవనంలో ఉండే వారి మనస్తత్వమే ఇలా ఉంటే ఇతరుల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. -
రాష్ట్రపతి, ప్రధానిలకు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని తెలిపారు. ఎందుకంటే.. రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని పేర్కొన్నారని గుర్తుచేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ రాసిన లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ రాసిన లేఖ -
రాష్ట్రపతిని కలిసిన రాహుల్,ఇతర విపక్షాలు
-
ఆచి తూచి అడుగేయాలి
దళిత వర్గాలను కులం పేరుతో కించపరిచినా, ఆ వర్గాల పట్ల వివక్ష చూపినా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమిస్తున్న ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్న ఉదంతాలు అనేకం ఉంటున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, వాటిని నివారించేందుకు కీలక ఆదేశాలిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఈ చట్టం కింద ఫిర్యాదులొస్తే తక్షణ అరెస్టుకు అవకాశం ఉండదు. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో అయితే సీనియర్ పోలీసు సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) అనుమతి తీసుకోవాలి. అంతే కాదు... ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు సంబంధిత కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అని ప్రాథమిక విచారణ జరపాలి. అది సహేతుకమైనదని నిర్ధా రించుకోవాలి. కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకుంటే నింది తుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని కూడా సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు మూడు దశాబ్దాలనాడు వచ్చిన ఈ చట్టం అమలు విషయంలో మొదటినుంచీ రెండు రకాల అభిప్రాయాలుంటున్నాయి. అది సమర్ధవంతంగా అమలు కావడం లేదని, కేసు నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నదని దళిత సంఘాలు ఆరోపిస్తుండగా...తమపై అన్యాయంగా కేసు పెట్టారని వాపోయేవారూ ఉంటు న్నారు. కేవలం ఈ చట్టం విషయంలోనే కాదు... దాదాపు అన్ని చట్టాల అమలు విషయంలోనూ ఇలాంటి పరస్పర విరుద్ధమైన వాదనలు వినబడటం రివాజే. మన దేశంలో శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న కులవ్యవస్థ అసమానత లకూ, అఘాయిత్యాలకూ, అవమానాలకూ, వివక్షకూ తావిస్తోంది. దీన్ని సరిదిద్దేం దుకు కొందరూ, నామరూపాల్లేకుండా చేయాలని మరికొందరూ ప్రయత్నిస్తున్నా కులతత్వం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. 1905లో బాబా సాహెబ్ అంబే డ్కర్ ఎదుర్కొన్నలాంటి స్థితిగతులే కాస్త హెచ్చుతగ్గులతో ఇప్పటికీ రాజ్యమేలుతు న్నాయి. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంవల్ల, అది కల్పించిన హక్కుల వల్ల ఆ వర్గాల్లో విద్యాధికులు పెరిగారు. చైతన్యం హెచ్చింది. ప్రశ్నించే తత్వం విస్తరిస్తోంది. అంతమాత్రాన సమాజంలో వివక్ష అంతరించిందా? అవమానాలూ, అఘాయిత్యాలూ సమసిపోయాయా? దళి తులకూ, ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్ల సదుపాయం లభించి వచ్చే ఏడాదికి 70 ఏళ్లవుతుంది. ఇంతకాలమైనా దళిత వర్గాల్లోని అట్టడుగు కులాలకు అవి ఇంకా చేరనేలేదు. మరోపక్క 1958నాటి కిలవేన్మణి(తమిళనాడు) ఉదంతం మొదలుకొని నిన్నమొన్నటి ఉనా(గుజరాత్) ఘటన వరకూ దళితులపై ఆధిపత్య కులాల అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1996లో దళిత యువకులకు శిరోముండనం చేసిన ఉదంతం జరిగి 22 ఏళ్లవుతున్నా ఈనా టికీ ఆ కేసు నత్తనడకన నడుస్తోంది. పైగా బాధితులు దళితులు కాదు.. బీసీలన్న వాదనలు బయల్దేరుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో ఆరోపణలొచ్చిన ఎవ రిపైనా ఇంకా దర్యాప్తు పూర్తికాలేదు. కేసులు నమోదు కాలేదు. ఆయన తల్లి దళిత మహిళే అయినా రోహిత్ వేముల బీసీ కులంకిందికొస్తారని తర్కిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఉదంతం విచారణలోనూ ఏళ్ల తరబడి అనిశ్చితే అలముకొంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఈమధ్యే దానికి కదలిక వచ్చింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం1989లో వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు లేనేలేవని ఎవరూ అనరు. ఏ చట్టాన్నయినా దుర్వినియోగం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన నిర్దిష్టమైన కేసు కూడా ఆ కోవలోనిదే కావొచ్చు. కానీ ఒక చట్టం దుర్వినియోగం అవుతున్నదా లేదా అనేది ఆ చట్టంకింద పడే శిక్షల శాతాన్నిబట్టి నిర్ణయించడం సబబుకాదు. కేసు వీగిపోవడానికి పోలీసు దర్యాప్తు సక్రమంగా లేకపోవడం మొదలుకొని సాక్షులు గట్టిగా నిలబడకపోవడం వరకూ సవాలక్ష కారణాలుంటాయి. ఆధిపత్యకులాల అజ్మాయిషీ బాగా నడిచేచోట తమకు జరిగిన అన్యాయంపై కేసులు పెట్టేందుకే దళితులు జంకుతారు. వారు ధైర్యం చేసి కేసులు పెట్టినా ఆ కేసుల్ని రిజిస్టర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తారు. భయపెట్టి, డబ్బు ఆశచూపి లోబర్చుకునే ప్రయత్నాలూ సాగుతాయి. ‘కేసు నిజ మైనదే అయినా తగిన సాక్ష్యాలు లేవ’ని, ‘తప్పుడు కేసుల’ని, ‘పొరబడి పెట్టిన కేసుల’ని పేరుబెట్టి బుట్టదాఖలా చేయడం చాలా ఉదంతాల్లో కనబడుతుంది. నిజా నికి ఈ చట్టంకింద పోలీసులు పెట్టే కేసుల్లో 50 శాతం న్యాయస్థానాల వరకూ పోనేపోవని ఆమధ్య ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అధ్యయనంలో తేలింది. 2015లో ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ఆచరణలో బాధితులకు సక్రమంగా వినియోగపడటం లేదని భావించి దానికి సవరణలు తీసు కొచ్చింది. అయినప్పటికీ నిరుడు కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికను బట్టి చూస్తే చట్టం అమల్లో ఉన్నా దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. చట్టం కారణంగా అమాయక పౌరులకు వేధింపులుండరాదని, కులవిద్వేషాలు ఏర్పడకూడదని సుప్రీంకోర్టు వెలిబుచ్చిన ఆత్రుత అర్ధం చేసుకోదగిందే. ఆ చట్టం కింద అందిన ఫిర్యాదులపై చిత్తశుద్ధితో సత్వర దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసు కున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలతో నిమిత్తం లేకుండానే చాలా సందర్భాల్లో కేసుల నమోదులో, నిందితుల అరెస్టులో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఇకపై అది మరింత పెరిగే ప్రమాదం లేదా? అన్ని కోణాల్లోనూ తాజా తీర్పును పరిశీలించి అణగారిన వర్గాల హక్కులకు భంగం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. -
అవసరం తీరాక కులం తక్కువన్నాడు..
నాగోలు: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈసంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... ఎన్టీఆర్నగర్కు చెందిన ఓ యువతి (25) అద్దె ఇంట్లో ఉంటోంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం యాప్రాకపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున్ కూడా యువతి ఉండే ఇంట్లోనే పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి చేసుకోవాలని మల్లికార్జున్ సొంత గ్రామానికి వెళ్లి నిలదీయగా తక్కువ కులం అంటూ పెళ్లి చేసుకోనని బెదిరించాడు. తనను శారీరకంగా వాడుకుని కులం పేరుతో దూషించిన మల్లికార్జున్‌పై యువతి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.