
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని తెలిపారు.
ఎందుకంటే.. రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని పేర్కొన్నారని గుర్తుచేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ రాసిన లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ రాసిన లేఖ
Comments
Please login to add a commentAdd a comment