అట్రాసిటీ కేసుపై విచారణ జరుపుతున్న డీఎస్పీ మోహనరావు
స్థానిక వెంకటేశ్వర కాలనీలోని తాగునీటి బావి వివాదంలో మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహనరావు శనివారం విచారణ చేపట్టారు. తాగునీటి బావిని కూల్చుతున్న సమయంలో మహిళలు అడ్డుకొనేందుకు ప్రయత్నించగా అసభ్యకర పదజాలం ఉపయోగించారని పడాల లక్ష్మి, అవనాపు ఇంద్ర, పడాల కనక మహాలక్ష్మిలు ఉదయ్, సుజాతలపై అట్రాసిటి కేసును పెట్టారు.
పొందూరు : స్థానిక వెంకటేశ్వర కాలనీలోని తాగునీటి బావి వివాదంలో మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహనరావు శనివారం విచారణ చేపట్టారు. తాగునీటి బావిని కూల్చుతున్న సమయంలో మహిళలు అడ్డుకొనేందుకు ప్రయత్నించగా అసభ్యకర పదజాలం ఉపయోగించారని పడాల లక్ష్మి, అవనాపు ఇంద్ర, పడాల కనక మహాలక్ష్మిలు ఉదయ్, సుజాతలపై అట్రాసిటి కేసును పెట్టారు. ఈ మేరకు బావి ఉన్న వీధిలో ప్రజలు, పంచాయతీ ఈవో, తదితరుల నుంచి సమాచారం సేకరించారు. దర్యాప్తును కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. విచారణలో ఎస్.ఐ చింతాడ ప్రసాదరావు, ఈవో మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.