
న్యూఢిల్లీ: దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6న ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. కోర్టు ఆదేశించినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదుచేసేలా నిబంధనలను తిరిగి చేర్చారు. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఈ చట్టంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment