ఎస్సీ, ఎస్టీ చట్టసవరణకు సుప్రీం కోర్టు మద్దతు | Supreme Court Supports Sc St Attrocities Amendment Act | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ చట్టసవరణకు సుప్రీం కోర్టు మద్దతు

Published Mon, Feb 10 2020 3:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సీనియర్‌ పోలీస్‌ అధికారి అనుమతి అవసరం లేదని, ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారం ఉండేలా చట్ట సవరణలో వెసులుబాటు కల్పించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement