
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ పార్టీ మరోసారి టార్గెట్ చేసింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న దళితులపై దాడి ఘటనపై మోదీ తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా మోదీ మౌనబాబాలాగ ఉంటే సరిపోదని విమర్శించింది. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ మహారాష్ట్రలో దళితులకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న కులపోరాటాలపై మోదీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కోరేగావ్ వద్ద జరిగిన యుద్ధంలో అగ్రవర్ణాలపై దళితులు విజయం సాధించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద సంఖ్యలో దళితులు రాగా.. వారిని కొంతమంది అగ్రకులవర్గాల వారు వ్యతిరేకించారు. పైగా అది ఆంగ్లేయుల విజయం అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘర్షణలో ఓ అగ్రకులానికి చెందిన యువకుడు మృతిచెందాడు. దీంతో రెండు వర్గాల ఘర్షణగా మారి మహారాష్ట్రలో దళితులు ఉద్యమ రూపంలో ఆందోళన చేస్తున్నారు. ఇది మూడు రోజులైనా ఇప్పటి వరకు చల్లారలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మౌనం వీడాలని ఖర్గే అన్నారు. మోదీ లోక్‌సభ సభ్యుడు అని ఆయన సభకు ఎందుకు రావడం లేదని, ఆయనను వెంటనే రావాలని ఆదేశించాలని స్పీకర్ కోరారు. మరోపక్క, బీజేపీ నేత అనంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ కుల చిచ్చును కాంగ్రెస్ పార్టీ మరింత రాజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో శాంతిని కోరుకోవడానికి బదులు ఆ ఆపర్టీ విభజన రాజకీయాలు చేస్తున్నారని, బ్రిటీష్ వారికి ఏ మాత్రం తీసిపోనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment