నేను జ్యోతిష్యుడిని.. మోదీ పదవి పోతుంది! | I am an astrologer, narendra modi will go soon, says lalu prasad | Sakshi
Sakshi News home page

నేను జ్యోతిష్యుడిని.. మోదీ పదవి పోతుంది!

Published Tue, May 23 2017 2:43 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

నేను జ్యోతిష్యుడిని.. మోదీ పదవి పోతుంది! - Sakshi

నేను జ్యోతిష్యుడిని.. మోదీ పదవి పోతుంది!

తనకు జ్యోతిష్యం తెలుసని, నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే అధికారం కోల్పోతుందని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ చెప్పారు. తనకు సంబంధించిన 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారన్న విషయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో లాలుకు సంబంధం ఉన్న 22 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి సోదాలు చేశారంటూ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ 22 చోట్ల సోదాలు చేశారో తనకు చెప్పాలని, ఆ ప్రాంతాలు ఏంటని ఆయన విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

ఈ సందర్భంలోనే ఆయన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచకుపడ్డారు. తనకు జ్యోతిష్యం బాగా తెలుసని, మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేయబోదని తాను స్పష్టంగా చెప్పగలనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో లాలు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారులు, రాష్ట్ర మంత్రులు అయిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లు బలవంతంగా లాక్కున్న భూమిలో ఓ పెద్ద మాల్‌ను నిర్మిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని లాలు ఖండించారు. తన కుమారులు ఆ భూమిని కొనుగోలు చేసి డెవలపింగ్‌కు ఇచ్చారని, అందులో 50 శాతం బిల్డర్‌కు, మిగిలింది తనవాళ్లకు వస్తుందని, వాళ్లు బతకాల్సిన అవసరం లేదా అంటూ ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement