డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా | Silence 2 The Night Owl Bar Shootout Official Release Date Locked, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా

Published Wed, Apr 3 2024 12:20 PM | Last Updated on Wed, Apr 3 2024 1:13 PM

Silence 2 The Night Owl Bar Shootout Official Release Date Locked - Sakshi

మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్‌లో నటించిన 'సైలెన్స్‌' (Silence... Can You Hear It?) అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా 2021లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్నడం విశేషం.

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సైలెన్స్‌ చిత్రం మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్' మీ ముందకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో    బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించారు. ఏప్రిల్‌ 16 నుంచి సైలెన్స్ 2 సినిమా జీ5లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ప్రస్తతం హిందీ వర్షన్‌ మాత్రమే అందుబాటులోకి రానుంది.  ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న హంతకులను పట్టుకునే మిస్టరీని  ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్ ఏ విధంగా చేదించాడనేది కథకు ప్రధాన మూలం. కథలో ఎన్నో ట్విస్ట్‌లతో పాటు థ్రిల్లింగ్‌ను పంచే సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 16న విడుదల కానున్న సైలెన్స్‌ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందన జీ5 ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement