
రానా
సినిమాలో కీలక పాత్ర ఉంది. నిడివి తక్కువే. మామూలుగా అయితే కొందరు ఆర్టిస్టులు నిడివి గురించి ఆలోచించిన నో అంటారు. కానీ నో ప్రాబ్లమ్ నేనున్నా అంటారు రానా. ఇంతకుముందు చాలా సినిమాల్లో అతిథిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో గెస్ట్‌గా కనిపించారు. లేటెస్ట్‌గా అనుష్క, మాధవన్ సైలెంట్ థ్రిల్లర్ చిత్రంలోనూ అతిథిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సైలెంట్‌గా ఉన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందట.
‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలో జరగనుంది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క, రానా స్క్రీన్ షేర్ చేసుకోబోయే చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment