ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాంకోవర్‌లోని భారత్ కాన్సలేట్ జనరల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది.
‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవటంలో భారత్ ముందజంలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ 23తో 39 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ దాడిలో 86 మంది చిన్నారులతో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు.
.. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబ్ దాడిలో మృతి చెందినవారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం. జూన్ 23న స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లేగ్రౌండ్‌లో జరిగే ఈ స్మారక కార్యకమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని భారత్ కాన్సలేట్ జనరల్ పేర్కొంది.
India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)
— India in Vancouver (@cgivancouver) June 18, 2024
ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం కెనడా పార్లమెంట్( హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించింది.
ఖలిస్తానీ టైగర్ ఫోర్స్( కేటీఎఫ్) చీఫ్ హర్దిప్ సింగ్ నిజ్జర్ గతేడి జూన్ 18 కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్‌ను హత్య చేసిన వారిలో నలుగురు భరతీయులు.. కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు.
తీవ్రవాది హర్దిప్ హత్యతో భారత్ హస్తం ఉందిన కెనడా ఆరోపలు చేసింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక.. అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.ఇక.. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.
ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్..
భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్‌కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే హత్య చేయబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment