
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. షూటింగ్ పనుల్ని పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోఉంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న భాగమతి ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది.
ట్రైలర్ ప్రకారం ఓ ప్రభుత్వాధికారిగా అనుష్క కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రాజెక్టు కోసం అనుష్క చేసిన కృషి.. దాని తర్వాత ఎదురైన సమస్యలను ఇందులో చూపించారు. 'ఎవడు పడితే వాడు రావడానికి.. ఎపుడు పడితే అపుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను..' అంటూ అనుష్క చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఆసక్తి రేకెత్తించే ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment