
సాక్షి, చెన్నై: హీరో ప్రభాస్ తనకు మంచి మిత్రుడు అంతే. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదు అని నటి అనుష్క స్పష్టం చేశారు. ఈ బాహుబలి జంట గురించి చాలా కాలంగా రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అనుష్క చాలాసార్లు స్పందించినా, తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్, ఆషాశరత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఇలా ఉండగా భాగమతి చిత్ర పరిచయ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా అనుష్క విలేకరులతో ముచ్చటించారు. భాగమతి సస్పెన్స్, థ్రిల్లర్ సన్నివేశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిపారు. ఇందులో తాను సంజన అనే ఐఏఎస్ అధికారిణిగా నటించానని చెప్పారు. తన పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారని సరైన వ్యక్తి తారసపడినప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు.
నటుడు ప్రభాస్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా స్టార్ హీరోల రాజకీయ రంగప్రవేశం గురించి తనను ప్రశ్నలు అడుగుతున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయం అని, దీనిపై తాను మాట్లాడనని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనేనని అనుష్క పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment