అనుష్క ‘భాగమతి’లో మెరుపులా బాహుబలి! | Prabhas spotted in Anushka starrer Bhaagamathie | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 11:33 AM | Last Updated on Thu, Jan 25 2018 11:52 AM

Prabhas spotted in Anushka starrer Bhaagamathie - Sakshi

‘బాహుబలి’లో దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం​చేసుకున్న అనుష్క తాజాగా ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. యాక్షన్‌ థిల్లర్‌గా పలు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రమోషనల్‌ సాంగ్ వీడియోను విడుదల చేశారు. అనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్‌ వీడియోలో ఓ స్పెషల్‌ ఎఫెక్ట్‌ ఇప్పుడు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం.. ఈ వీడియోలో ప్రభాస్‌ అనూహ్యంగా దర్శనమివ్వడమే.. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన ప్రభాస్‌ ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉండగా.. అలా చూపించి చూపించనట్టు ఇందులో చూపించారు. ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్నా.. అతను బహుబలి గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మూడు నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల వద్ద ప్రభాస్‌ తళుక్కున మెరుస్తాడు.

పలు సినిమాల్లో కలిసి నటించి.. ఆన్‌స్క్రీన్‌ కెమెస్ట్రీని బాగా పండించిన అనుష్క-ప్రభాస్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తామిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమేనని ఇటు అనుష్క, అటు ప్రభాస్‌ చెప్తున్నారు. మొత్తానికి ఏదీఏమైనా ఈ వీడియోలో ప్రభాస్‌ కనిపించడం ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో ఏమైనా కనిపిస్తారా? అన్న ఊహాగానాలకు తావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement