
బాహుబలి-2 తర్వాత అనుష్క ‘భాగమతి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల అయింది. ఈ ట్రైలర్‌ను యంగ్ హీరో ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అంతేకాక అనుష్క నటనను పొగడ్తలతో ముంచెత్తారు. అనుష్క చాలా కష్టపడుతుంది.. డెడికేషన్ ఎక్కువ అని హీరో ప్రభాస్ అన్నారు. ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో ‘ట్రూ హార్డ్‌వర్క్, డెడికేషన్.. గుడ్ లక్ స్వీటీ, అశోక్, యూవీ క్రియేషన్స్ టీంకి కూడా గుడ్‌లక్’ అని పోస్టు చేశాడు.
గతంలో భాగమతి టీజర్ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్ అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాకు పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా.. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment