భాగమతిపై చరణ్‌ పొగడ్తలు | ram charan praises anushka and bhaagamathie team | Sakshi
Sakshi News home page

భాగమతిపై చరణ్‌ పొగడ్తలు

Published Thu, Feb 1 2018 9:11 PM | Last Updated on Thu, Feb 1 2018 9:11 PM

ram charan praises anushka and bhaagamathie team - Sakshi

రామ్‌చరణ్‌  ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్లు, కొత్త విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అందరినీ అలరిస్తారు. ఏదైనా సినిమా విడుదలౌతుందంటే ఆయా వ్యక్తులకు శుభాకాంక్షలు తెలపడం, ఫోన్‌ చేసి అభినందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరితో సన్నిహితంగా మెలిగే వ్యక్తి అని పేరు కూడా సంపాదించుకున్నారు. అందుకే చరణ్‌ అంటే అభిమానులకు  ఎనలేని ప్రేమ.

తాజాగా రామ్‌ చరణ్‌ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు. గత రాత్రి భాగమతి చూశానని,  అనుష్క అద్భుతంగా నటించిందంటూ ఆకాశానికెత్తాశారు. సాంకేతిక అంశాలు, చిత్ర నిర్మాణం సూపర్‌గా ఉందన్నారు.చాలా మంచి సినిమా తీసిన అందరికీ అభినందనలు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. భయంతో రాత్రి తన సతీమణి ఉపాసన నిద్ర కూడా పోలేదని చలోక్తి విసిరాడు.

గతంలో బాహుబలి సమయంలోను చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపాడు. శ్రీమంతుడు సినిమా సమయంలోను  చరణ్‌ మహేష్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement