‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ ఏడాది నానీతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్ గురించి మేర్లపాక గాంధీ బయటకు చెప్పలేదు. అయితే ఫుల్ ఫోకస్‌తో సైలెంట్‌గా కథ రెడీ చేస్తున్నారట. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుందని సమాచారం. ఇంతకుముందు మేర్లపాక దర్శకత్వంలోనే వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment